Sri Lanka Floods: 'ఆపరేషన్ సాగర్ బంధు' పేరుతో సహాయక చర్యలు.. భారత్‌కు ధన్యవాదాలు తెలిపిన శ్రీలంక

Sri Lanka Floods India Launches Operation Sagar Bandhu
  • వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం
  • ఇప్పటికే 53 టన్నుల సహాయ సామగ్రిని అందించిన భారత్
  • రంగంలోకి దిగిన భారత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
  • భారత్ సాయంపై శ్రీలంక భావోద్వేగ పోస్ట్
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన పొరుగు దేశం శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. 'ఆపరేషన్ సాగర్ బంధు' పేరుతో ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
 
ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సి-130జె విమానాల ద్వారా ఇప్పటికే 53 టన్నుల సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువులు ఉన్నాయి. ఇది తొలి విడత సాయం మాత్రమేనని, శ్రీలంకకు సహాయక చర్యలు కొనసాగుతాయని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
 
శ్రీలంకలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా 334 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ కష్టకాలంలో భారత్ అందిస్తున్న సహాయం పట్ల శ్రీలంక ప్రభుత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను పంచుకుంది. భారత్ అందిస్తున్న చేయూత ఇరు దేశాల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Sri Lanka Floods
Operation Sagar Bandhu
India Sri Lanka Relations
NDRF
Sri Lanka Disaster Relief
Indian Air Force C-130J
Sri Lanka Flood Relief
India Humanitarian Aid
Colombo
Disaster Management

More Telugu News