Shamirpet Police Station: దేశంలోనే 7వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్‌పేట పీఎస్

Shamirpet Police Station Ranked 7th Best in India
  • ప్రతి సంవత్సరం 10 ఉత్తమ పోలీస్ స్టేషన్‌ల ఎంపిక
  • మొదటి పది పోలీస్ స్టేషన్‌లను ఎంపిక చేసిన హోంశాఖ
  • అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా ఘాజీపూర్ ల్యాండ్‌ఫీల్ పీఎస్
దేశంలోని ఏడో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ పరిసర ప్రాంతమైన శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు చోటు దక్కింది. కేంద్ర హోంశాఖ ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేసిన మొదటి 10 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో, ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలవగా, శామీర్‌పేట పోలీస్ స్టేషన్ సైతం టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ పురుషోత్తం, ఏసీపీ బాలగంగిరెడ్డి... శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్ తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.

దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్‌ల పనితీరు, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వక ప్రవర్తన, ఫిర్యాదుల సత్వర పరిష్కారం, పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, పచ్చదనం, సిబ్బంది పనితీరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంశాఖ ర్యాంకులు కేటాయిస్తుంది.
Shamirpet Police Station
Hyderabad police
Telangana police
Best police stations India

More Telugu News