Kailasagiri: విశాఖలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం

Visakhapatnam Opens New Glass Bridge at Kailasagiri
  • కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
  • హాజరైన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రామకృష్ణబాబు
  • రూ. 7 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం
విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. సుమారు రూ. 7 కోట్ల నిధులతో ఈ గ్లాస్ బ్రిడ్జిని కైలాసగిరిపై నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. 

ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గాజును వినియోగించారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. గ్లాస్ బ్రిడ్జ్ ఒకేసారి 500 టన్నుల బరువు మోయగలదు. 250 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఒకేసారి 40 మంది ఎక్కవచ్చు.

ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ... పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకుని నిలబడేలా గ్లాస్ బ్రిడ్జిని నిర్మించామని తెలిపారు. కైలాసగిరిపై త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
Kailasagiri
Visakhapatnam
Glass Bridge
Pranav Gopal
VMRDA
Tourism
Andhra Pradesh
Pilla Srinivasa Rao
Bharat
Velagapudi Ramakrishna Babu

More Telugu News