కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ షోకాజ్ నోటీసులు
- సీఎం పీఏతో పాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రికి కూడా..
- 2019లో మసాలా బాండ్ జారీలో ఫెమా రూల్స్ ఉల్లంఘన
- కేఐఐఎఫ్ బీ నిధుల సమీకరణపై సందేహాలు
అసలు ఏంటీ వివాదం..
కేరళలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కేఐఐఎఫ్ బీ 2019 లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సుమారు రూ.2,150 కోట్ల విలువైన మసాలా బాండ్ లను జారీ చేసింది. ఈ నిధుల సమీకరణ మరియు వాటి వినియోగంలో ఫెమా నిబంధనలను పాటించలేదని, ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన కేఐఐఎఫ్ బీ.. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ మార్కెట్ల నుండి నేరుగా రుణాలు తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1)కి విరుద్ధమని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అయితే, కేఐఐఎఫ్ బీ తన కార్యకలాపాలు చట్టబద్ధంగా, ఆర్బీఐ మార్గదర్శకాలకు లోబడి ఉన్నాయని, ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ పరిధిలోకి రావని వాదించింది.