కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ షోకాజ్ నోటీసులు
- సీఎం పీఏతో పాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రికి కూడా..
- 2019లో మసాలా బాండ్ జారీలో ఫెమా రూల్స్ ఉల్లంఘన
- కేఐఐఎఫ్ బీ నిధుల సమీకరణపై సందేహాలు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. విజయన్ తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు సమీకరించే ప్రభుత్వ సంస్థ కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (కేఐఐఎఫ్ బీ) 2019లో జారీ చేసిన మసాలా బాండ్‌ల వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేసింది. నిధుల సేకరణలో ఫెమా మార్గదర్శకాలను పాటించలేదన్న ఈడీ ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఏంటీ వివాదం..
కేరళలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కేఐఐఎఫ్ బీ 2019 లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సుమారు రూ.2,150 కోట్ల విలువైన మసాలా బాండ్ లను జారీ చేసింది. ఈ నిధుల సమీకరణ మరియు వాటి వినియోగంలో ఫెమా నిబంధనలను పాటించలేదని, ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన కేఐఐఎఫ్ బీ.. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ మార్కెట్ల నుండి నేరుగా రుణాలు తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1)కి విరుద్ధమని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అయితే, కేఐఐఎఫ్ బీ తన కార్యకలాపాలు చట్టబద్ధంగా, ఆర్బీఐ మార్గదర్శకాలకు లోబడి ఉన్నాయని, ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ పరిధిలోకి రావని వాదించింది.