Chandrababu: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి.. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సూచన

Chandrababu Naidu urges TDP leaders to participate in program for poor
  • నిరంతరం ప్రజల్లో ఉండాలని హితవు
  • ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న టీడీపీ అధినేత
  • పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలన్న చంద్రబాబు
రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే వారే నాయకులుగా రాణిస్తారని ఆయన చెప్పారు. ఈమేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘పేదల సేవలో’ కార్యక్రమంలో పార్టీ నాయకులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలని నేతలకు తెలిపారు. 'పేదల సేవలో' కార్యక్రమంలో నాయకుల భాగస్వామ్యం ప్రస్తుతం 25 వేలకు చేరిందని చంద్రబాబు వెల్లడించారు.
Chandrababu
TDP
Telugu Desam Party
Andhra Pradesh
Pensions
Poor people welfare
Public service
Political leaders

More Telugu News