California Shooting: కాలిఫోర్నియాలో కాల్పులు.. నలుగురు మృతి, 10 మందికి గాయాలు

California Shooting Injures Dozens in Stockton



అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్ టన్ నగరంలో శనివారం రాత్రి కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ బాంక్వెట్ హాల్ లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా చొరబడ్డ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో నలుగురు మరణించగా, పది మందికి బుల్లెట్ గాయాలయ్యాయని పేర్కొంది.

దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ కాల్పులకు కారణమేంటనేది తెలియరాలేదని వివరించారు. మృతులను గుర్తించాల్సి ఉందని చెప్పారు.
California Shooting
Stockton California
US Shooting
San Joaquin County
California Crime
Shooting Injury
Gun Violence
Crime News

More Telugu News