Seethakka: బీఆర్ఎస్ దీక్షా దివస్‌పై మంత్రి సీతక్క విమర్శలు

Seethakka Criticizes BRS Deeksha Divas as Drama
  • బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే నిర్వహించేవారన్న సీతక్క
  • ప్రజలకు పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్
  • రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెబుతామన్న మంత్రి
బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివస్‌పై తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ నిర్వహించేవారని, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు పది రోజుల పాటు ఆ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. పదేళ్లలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో ఈ దీక్షా దివస్‌లో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేసిందని అన్నారు.

ఈ విజయాలను ప్రజలకు వివరించేందుకు తాము పది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిని అడ్డుకునే కుట్రతోనే బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతోందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక వందల రెట్లు లబ్ధి పొందింది కేసీఆర్ కుటుంబమేనని ఆమె ఆరోపించారు.

ఆ పార్టీ దగ్గర ప్రస్తుతం అధికారం మాత్రమే లేదని, కానీ కోట్లాది రూపాయలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటామని, లేకపోతే బయటకే రావొద్దని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని ఆమె విమర్శించారు. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు విశ్వసించరని ఆమె స్పష్టం చేశారు.
Seethakka
BRS Deeksha Divas
Telangana Politics
Minister Seethakka Comments

More Telugu News