TTD: టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో మరో 11 మంది పాత్ర

TTD Ghee Adulteration Case SIT Adds 11 New Suspects
  • కేసు విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు
  • తొలుత 15 మందిని, తర్వాత మరో 9 మందిని..
  • తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేర్చిన సిట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వేగవంతం చేసింది. ఈ కేసులో తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేర్చింది. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రభుత్వం సిట్ కు అప్పగించిన విషయం విదితమే.

ఈ కేసులో తొలుత 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 35 మందిపై కేసు నమోదు చేసి, పది మందిని అరెస్టు చేసింది. నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు ఉండడం గమనార్హం. 2019-2024 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లను ఈ కేసులో చేర్చింది. సిట్ నిందితుల జాబితాలో గతంలో టీటీడీలో జీఎంగా పనిచేసిన జగదీశ్వర్‌ రెడ్డి, మురళీకృష్ణ, ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్‌ హరినాథ్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.
TTD
TTD Ghee Scam
Tirumala Tirupati Devasthanam
Nellore ACB Court
Special Investigation Team
Ghee Adulteration
Andhra Pradesh
Jagadeeshwar Reddy
Muralikrishna
Harinath Reddy

More Telugu News