Gold prices: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరుగుదల!

Gold Silver Prices Soar to Record Highs in Hyderabad
  • రూ.1,29,820కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం
  • కిలో వెండిపై ఒక్కరోజే ఏకంగా రూ.9,000 పెరుగుదల
  • మధ్య తరగతి వర్గాల్లో ఆందోళన పెంచుతున్న ధరలు
బంగారం, వెండి ధరలు పగ్గాలు లేకుండా పెరిగిపోతున్నాయి. ఈరోజు పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ఆల్-టైమ్ గరిష్ఠాలకు చేరువయ్యాయి. ఈ ధరల పెరుగుదలతో సామాన్యులకు బంగారం, వెండి మరింత భారంగా మారనుంది.

హైదరాబాద్ మార్కెట్‌లో ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,360 పెరిగింది. దీంతో దాని ధర రూ.1,29,820కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,250 పెరిగి, దాని తుది ధర రూ.1,19,000గా నమోదైంది.

బంగారం ధరలను మించి వెండి ధర కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌లో కిలో వెండిపై ఒక్కరోజే ఏకంగా రూ.9,000 పెరిగింది. ఈ భారీ పెరుగుదలతో కిలో వెండి ధర రూ.1,92,000కు చేరింది. ప్రస్తుత ధరల సరళిని బట్టి చూస్తే, త్వరలోనే కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కును కూడా దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగలు, శుభకార్యాలకు కొనుగోళ్లు చేయాలనుకునే మధ్యతరగతి వర్గాల్లో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 
Gold prices
Silver prices
Hyderabad
Gold rate today
Silver rate today
Commodity market
Price hike
Indian market
24 Carat gold
22 Carat gold

More Telugu News