Nanda Kumar: కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా

Nanda Kumar Resigns as Kaloji University Vice Chancellor
షార్ట్స్‌లో చూడండి
కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ నందకుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల యూనివర్సిటీలో చోటుచేసుకుంటున్న అక్రమాల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఒక విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

తనను అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఒక విద్యార్థిని యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్దేశపూర్వకంగా తనను ఫెయిల్ చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై వైద్య శాఖ అధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో సంచలన విషయాలుు వెలుగులోకి వచ్చాయి.

యూనివర్సిటిలో ఒక విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, రాత్రి సమయంలో అసభ్యకరం సందేశాలు పంపి వేధించేవాడని విచారణలో కమిటీ గుర్తించింది. యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనే జవాబు పత్రాలపై తప్పులు పెట్టి, విద్యార్థినిని ఫెయిల్ చేయించాడని కమిటీ తేలింది. అయితే, తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశానని, ఫెయిల్ అయ్యే అవకాశం లేదని విద్యార్థిని విజ్ఞప్తి చేయగా, ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె జవాబు పత్రాన్ని రీవాల్యుయేషన్ చేసి పాస్ అయినట్లు గుర్తించారు.
Go Back to Shorts
Nanda Kumar
Kaloji University
Kaloji Health University
Vice Chancellor Resigns
Telangana University

More Telugu News