Justice Surya Kant: అలాంటి వారి కోసం కోర్టులోనే అర్ధరాత్రి వరకైనా కూర్చుంటాను: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

Justice Surya Kant Ready to Sit in Court Till Midnight for Poor
  • తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలు ఉండవన్న సీజేఐ
  • అలాంటి కేసులను సంపన్నులు వేస్తారని వ్యాఖ్య
  • పేద కక్షిదారులకు న్యాయం తన తొలి ప్రాధాన్యత అని స్పష్టీకరణ
పేద కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడటం తన తొలి ప్రాధాన్యత అని, అవసరమైతే వారి కోసం అర్ధరాత్రి వరకు న్యాయస్థానంలో కూర్చుంటానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. తిలక్ సింగ్ డాంగీ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరులపై దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన సందర్భంగా సీజేఐ ఈ విధంగా స్పందించారు.

తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలు ఉండవని, ఇటువంటి కేసులను సంపన్నులు వేస్తారని సీజేఐ అన్నారు. "నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చివరి వరుసలో ఉండే పేదవారి కోసం నేను ఇక్కడ ఉన్నాను. అవసరమైతే వారి కోసం అర్ధరాత్రి వరకు ఇక్కడే కూర్చుంటాను" అని ఆయన వ్యాఖ్యానించారు.

జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 15 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9న సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు.
Justice Surya Kant
CJI Surya Kant
Chief Justice of India
Poor litigants
Justice for poor

More Telugu News