Revanth Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారు

Revanth Reddy Announces District Tours for Panchayat Elections
  • డిసెంబర్ 1 నుంచి ఒక్కో జిల్లాలో ఒక్కోరోజు పర్యటించనున్న ముఖ్యమంత్రి
  • డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ముఖ్యమంత్రి పర్యటన
  • మక్తల్, కొత్తగూడెం, హుస్నాబాద్, నర్సంపేట, దేవరకొండలలో పర్యటన
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది.

డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, డిసెంబర్ 2న ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6న నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగుతుంది.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. మూడు దఫాలుగా ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. 

మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27న ప్రారంభం కాగా పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన జరగనుంది. రెండవ దశ నామినేషన్లు నవంబర్ 30న, మూడవ దశ నామినేషన్లు డిసెంబర్ 3న ప్రారంభం కానుండగా, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 14న, మూడో దశ పోలింగ్ 17న జరగనుంది.
Revanth Reddy
Telangana Gram Panchayat Elections
Telangana Elections
Telangana Politics

More Telugu News