Prithviraj Sukumaran: పృథ్వీరాజ్‌ను ఇండస్ట్రీ నుంచి చెరిపేయాలని చూస్తున్నారు: మల్లికా సుకుమారన్

Prithviraj Sukumaran facing industry sabotage claims mother Mallika
  • తన కుమారుడిపై కుట్ర జరుగుతోందన్న పృథ్వీరాజ్ తల్లి
  • కెరీర్ నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపాటు
  • సోషల్ మీడియాలో ఓ గ్రూప్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆవేదన 
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌పై ఉద్దేశపూర్వకంగా సైబర్ దాడి జరుగుతోందని ఆయన తల్లి, సీనియర్ నటి మల్లికా సుకుమారన్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక నటుడిగా తన కొడుకును సినీ పరిశ్రమ నుంచి చెరిపివేయడానికి కొందరు పెద్ద కుట్రే పన్నుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతడి కెరీర్‌ను అంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు.

మలయాళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మల్లికా సుకుమారన్ మాట్లాడుతూ.. "పృథ్వీరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది అతడిని పరిశ్రమ నుంచి తొలగించడానికి చేస్తున్న ఉద్దేశపూర్వక ప్రయత్నమే" అని అన్నారు. ఇటీవల పృథ్వీరాజ్ నటించిన ‘విలాయత్ బుద్ధ’ సినిమా నవంబర్ 21న విడుదలైంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఒక గ్రూప్ కావాలనే తన కొడుకును లక్ష్యంగా చేసుకుని నెగటివ్ ప్రచారం పెంచిందని ఆమె ఆరోపించారు.

జయన్ నంబియార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తర్వాత పృథ్వీరాజ్‌పై దాడులు ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు. కేవలం వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా పృథ్వీరాజ్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె వాపోయారు. ప్రస్తుతం మల్లికా సుకుమారన్ చేసిన ఈ వ్యాఖ్యలు మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
Prithviraj Sukumaran
Mallika Sukumaran
Malayalam cinema
Vilayath Buddha
Jayan Nambiar
Cyber attack
Movie industry
Film career
Malayalam movie

More Telugu News