Kamal Somani: రూ.50 లక్షల బీమా సొమ్ము కోసం డమ్మీ శవంతో అంత్యక్రియలు

Kamal Somani staged fake cremation for insurance money
  • ఢిల్లీకి చెందిన కమల్ సోమానీకి రూ.50 లక్షల అప్పు
  • అప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రణాళిక రచించిన సోమానీ
  • మరో వ్యక్తి పేరు మీద రూ.50 లక్షల బీమా కొనుగోలు చేసిన సోమానీ
  • ఆ వ్యక్తి చనిపోయాడంటూ డమ్మీ అంత్యక్రియలు నిర్వహిస్తూ దొరికిన నిందితులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు బీమా సొమ్ము కోసం ఒక బొమ్మతో నకిలీ అంత్యక్రియలు చేశారు. వారి పథకానికి అధికారులు విస్తుపోయారు. హర్యానాకు చెందిన నలుగురు వ్యక్తులు యూపీలోని గర్హ్‌ముక్తేశ్వర్ గంగా ఘాట్‌కు అంత్యక్రియలు చేయడానికి ఒక శవాన్ని తీసుకువచ్చారు. ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేయడానికి బదులు, నేరుగా చితిపైకి శవాన్ని తీసుకువెళ్లి దహన సంస్కారాలు ప్రారంభించారు.

ఆ నలుగురి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు దహన సంస్కారాలను అడ్డుకున్నారు. శవంపై ఉన్న వస్త్రాన్ని తొలగించి చూడగా, ప్లాస్టిక్ డమ్మీ శవం కనిపించింది. స్థానికులు గుమికూడటంతో వారు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, స్థానికులు ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. పోలీసులు నిందితులను ప్రశ్నించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.

తొలుత, ఢిల్లీ ఆసుపత్రి తమకు అసలు శవానికి బదులు డమ్మీ శవం ఇచ్చిందని నమ్మబలికే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పారు.

ఢిల్లీలోని కైలాస్‌పురికి చెందిన కమల్ సోమానీ రూ.50 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు గుర్తించారు. దాని నుంచి తప్పించుకోవడానికి అతను ఉత్తమ్ నగర్‌కు చెందిన స్నేహితుడు ఆశిష్ ఖురానాతో కలిసి పథకం రచించాడు. ఈ పథకంలో భాగంగా కమాల్ సోమానీ గతంలో తన వద్ద పనిచేసిన అన్షుల్ కుమార్ ఆధార్, పాన్ కార్డులను తీసుకున్నాడు. ఏడాది క్రితం అన్షుల్ పేరు మీద రూ.50 లక్షల జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసి, క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాడు. ఆ బీమా డబ్బు కోసం అన్షుల్ మరణించాడని నమ్మించేలా నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని పొందాడు.

అనంతరం స్నేహితుల సహాయంతో శవాన్ని దహనం చేస్తున్నట్లు అందరినీ నమ్మించడానికి నకిలీ అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశాడు. పోలీసులు అన్షుల్‌ను సంప్రదించగా, తాను ఆరోగ్యంగా ఉన్నానని, తన పేరు మీద పాలసీ ఉన్న విషయం కూడా తెలియదని చెప్పాడు. దీంతో పోలీసులు కమల్ సోమానీని, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Kamal Somani
Insurance fraud
Fake cremation
Uttar Pradesh
Life insurance policy
Anshul Kumar
Delhi
Financial crime
Crime news

More Telugu News