Kiara Advani: కూతురి పేరు ప్ర‌క‌టించిన కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా

Kiara Sidharth Announce Daughters Name Saraya Malhotra
  • చిన్నారికి సరాయాగా నామకరణం
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన కియార్, సిద్ధార్థ్
  • శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు
బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ దంపతులు తమ ముద్దుల కూతురి పేరును అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన ఈ జంట, తమ కుమార్తెకు ‘సరాయా మల్హోత్రా’ అని నామకరణం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తమ చిన్నారి తొలి ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు.

తమ తమ సోషల్ మీడియా ఖాతాలలో కియారా, సిద్ధార్థ్ ఒకే రకమైన పోస్ట్ చేశారు. ఇందులో వారు తమ కూతురి చిట్టి పాదాలను చేతుల్లోకి తీసుకున్న ఒక అందమైన ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి సరాయాకు ఆశీస్సులు అందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త తెలియడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
Kiara Advani
Sidharth Malhotra
Saraya Malhotra
Bollywood couple
Kiara Sidharth daughter
Bollywood news
Celebrity baby names
Saraya name meaning
Kiara Advani family
Sidharth Malhotra family

More Telugu News