Akhanda 2: నేడు ‘అఖండ-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో మళ్లింపు

Akhanda 2 Pre Release Event Traffic Restrictions in Kukatpally
  • బాలకృష్ణ 'అఖండ-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు
  • కూకట్‌పల్లి కైతలాపూర్ గ్రౌండ్ పరిసరాల్లో నేటి సాయంత్రం మళ్లింపులు
  • సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసుల సూచన
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కారణంగా శుక్రవారం కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. నవంబర్ 28, శుక్రవారం సాయంత్రం కైతలాపూర్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుండటంతో వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

ఈవెంట్ సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కైతలాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా జనసమ్మర్దం ఉంటుందని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు ఇలా ఉన్నాయి:

* మూసాపేట్ వైపు నుంచి భరత్‌నగర్, ఎర్రగడ్డ మీదుగా వచ్చే వాహనాలను కూకట్‌పల్లి Y జంక్షన్ వైపు మళ్లిస్తారు.
* కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి ఐడీఎల్ లేక్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అశోకా వన్ మాల్ వద్ద జేఎన్టీయూ రోడ్డులోకి పంపిస్తారు.
* మాదాపూర్, హైటెక్ సిటీల నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలను యశోద హాస్పిటల్ వద్ద నెక్సస్ మాల్, జేఎన్టీయూ వైపు మళ్లిస్తారు.

ఈవెంట్ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కోరారు. కాగా, డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Akhanda 2
Nandamuri Balakrishna
Boyapati Srinu
Kukatpally
Traffic diversions
Pre release event
Hyderabad traffic
Cyberabad police
Tollywood movies

More Telugu News