Telangana Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు... తొలిరోజు భారీగా నామినేషన్లు

Telangana Panchayat Elections See High Nomination Numbers on Day 1
  • తొలిరోజే సర్పంచ్ పదవులకు 3,242 నామినేషన్ల దాఖలు
  • ఈ నెల 29 వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం
  • డిసెంబర్ 11న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది.

రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవుల కోసం 3,242 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తొలి దశలో భాగంగా మొత్తం 4,236 గ్రామపంచాయతీలు, 37 వేలకు పైగా వార్డులకు పోలింగ్ జరగనుంది.

ఈ నెల 29 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 30వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి వార్డు సభ్యులు, సర్పంచుల ఫలితాలను వెల్లడిస్తారు. 
Telangana Panchayat Elections
Telangana local body elections
Panchayat elections nominations
Telangana Gram Panchayat
Telangana polls
Telangana election schedule
Telangana election results
Ward member elections

More Telugu News