TSPSC Group 2: తెలంగాణ 'గ్రూప్ 2'పై సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు

High Court Suspends Single Bench Verdict on TSPSC Group 2
  • 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట
  • ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన సింగిల్ బెంచ్
  • తాజాగా సీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు
తెలంగాణ గ్రూప్ 2 (2015) వివాదంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట లభించింది. 2015-16 లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వైట్ నర్‌, దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని టీజీపీఎస్సీపై ఆరోపణలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. గ్రూప్ 2 లో ఎంపికైన వారి జాబితాను రద్దు చేసింది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ మరోమారు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది.
TSPSC Group 2
Telangana Group 2
High Court
Exam Cancellation
TSPSC
Telangana Public Service Commission
Group 2 Results
Court Order
Exam Controversy
Telangana Jobs

More Telugu News