Bhatti Vikramarka: ఘనంగా భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక

Bhatti Vikramarkas Sons Engagement Held Grandly
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక
  • కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్
  • రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగ ప్రముఖుల హాజరు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు సూర్య విక్రమాదిత్య, సాక్షిల వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం, జయసుధ, టి.సుబ్బిరామిరెడ్డి వంటి ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రామోజీ గ్రూపు సంస్థల సీఎండీ కిరణ్, పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరై భట్టి విక్రమార్క కుటుంబానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకతో ప్రజాభవన్ ప్రాంగణం ప్రముఖుల రాకతో కళకళలాడింది. 
Bhatti Vikramarka
Surya Vikramaditya
Telangana Deputy CM
Engagement Ceremony
Praja Bhavan
Revanth Reddy
Chiranjeevi
Telangana Politics
Hyderabad Events

More Telugu News