Chandrababu Naidu: కృష్ణా జలాలపై హక్కును వదులుకునే ప్రశ్నే లేదు: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu No Question of Relinquishing Rights on Krishna Waters
  • కృష్ణా జలాలపై హక్కును వదులుకోబోమని చంద్రబాబు స్పష్టం
  • జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదని వెల్లడి
  • కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశం
  • వరద జలాలను మాత్రం సామరస్యంగా పంచుకోవడానికి సిద్ధమని ప్రకటన
  • జలవనరుల శాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జలాల కేటాయింపులపై ట్రైబ్యునల్ చేపట్టిన పునఃసమీక్షను అంగీకరించబోమని ఆయన తేల్చిచెప్పారు. అమరావతిలో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ అంశంపై కేంద్రం వద్ద రాష్ట్ర వాదనలను బలంగా వినిపించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అయితే, వరదల సమయంలో వచ్చే నీటిని మాత్రం సామరస్యపూర్వక వాతావరణంలో పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.


Chandrababu Naidu
Krishna River
Andhra Pradesh
AP
Water Rights
River Water Sharing
Water Resources
Amaravati
Telugu States
Krishna River Water Dispute

More Telugu News