ఢిల్లీ తర్వాత ముంబైలో వాయు కాలుష్యం.. రోహిత్ శర్మ భార్య పోస్టు వైరల్

  • గాలి నాణ్యత సూచీ 257గా ఉందని పేర్కొన్న రితికా సజ్దే
  • ముంబైలో ఏం జరుగుతోందని పోస్టు
  • రితిక ఫొటోను షేర్ చేస్తూ కాలుష్యంపై నెటిజన్ల ప్రశ్నలు
దేశ రాజధాని ఢిల్లీ తరువాత ఆర్థిక రాజధాని ముంబై సైతం కాలుష్య కోరల్లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో వాతావరణ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటం గమనార్హం. ముంబైలో గాలి నాణ్యత సూచీ 300 మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై వాయు కాలుష్యంపై టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఆందోళన వ్యక్తం చేసింది.

ముంబైలో వాతావరణ కాలుష్యంతో కమ్ముకున్న దట్టమైన పొగకు సంబంధించిన ఫొటోను ఆమె సామాజిక మాధ్యమంలో పంచుకుంది. "గాలి నాణ్యత సూచీ 257గా ఉంది... ఏం జరుగుతోంది?" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ముంబై వాయు కాలుష్యంపై రోహిత్ శర్మ భార్య స్పందించిన తీరుకు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. రితికా షేర్ చేసిన ఫొటోను అనేకమంది పంచుకుంటూ, ముంబై కాలుష్యం గురించి రితిక మాట్లాడిన విధంగానే ఢిల్లీకి చెందిన ప్రముఖులు కూడా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కాలుష్యం మనల్ని చంపుతుందని, ఇప్పటికైనా పరిస్థితి మారాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News