Fancy Number: కార్ నంబర్‌కు కోటి రూపాయలకు పైగా... దేశంలోనే కొత్త రికార్డు!

Fancy Number HR88B8888 Sells for Over 1 Crore in Haryana
  • హరియాణాలో ఫ్యాన్సీ నంబర్ కు రికార్డు ధర
  • HR 88 B 8888 నంబర్‌కు రూ. 1.17 కోట్లు
  • దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్‌గా గుర్తింపు
  • ఆన్‌లైన్ వేలంలో ఈ నంబర్ కోసం 45 మంది పోటీ
  • 'B' అక్షరం '8'లా కనిపించడమే ఈ నంబర్ ప్రత్యేకత
మన దేశంలో ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు తమ అదృష్ట సంఖ్యల కోసం, మరికొందరు తమ వాహనం ప్రత్యేకంగా కనిపించడం కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు. కానీ, హర్యానాలో జరిగిన ఓ వేలంపాటలో ఒక ఫ్యాన్సీ నంబర్ ఏకంగా కోటి రూపాయలకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 'HR 88 B 8888' అనే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఒక వ్యక్తి రూ. 1.17 కోట్లకు దక్కించుకున్నారు. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నంబర్‌గా రికార్డు సృష్టించింది.

హరియాణా రవాణా శాఖ ప్రతి వారం వీఐపీ నంబర్ల కోసం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తుంది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ఈ వారం వేలంలో 'HR 88 B 8888' నంబర్‌పై అందరి దృష్టి పడింది. ఈ ఒక్క నంబర్ కోసం ఏకంగా 45 మంది పోటీ పడ్డారు. రూ. 50,000 కనీస ధరతో ప్రారంభమైన వేలం, బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసేసరికి రూ. 1.17 కోట్ల వద్ద స్థిరపడింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకే ఈ నంబర్ ధర రూ. 88 లక్షలకు చేరడం పోటీ తీవ్రతను తెలియజేస్తోంది.

'HR 88 B 8888' నంబర్‌కు ఇంత ధర పలకడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఇందులో 'B' అక్షరం చూడటానికి '8' అంకెలా కనిపిస్తుంది. దీంతో నంబర్ ప్లేట్‌పై అన్నీ 8 అంకెలే ఉన్నట్లుగా ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. ఈ నంబర్‌ను విశ్లేషిస్తే.. 'HR' అంటే హరియాణా రాష్ట్ర కోడ్, '88' ఆ రాష్ట్రంలోని ఒక నిర్దిష్ట RTO కార్యాలయాన్ని సూచిస్తుంది. 'B' అనేది వాహన సిరీస్ కోడ్ కాగా, '8888' అనేది ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్.

Fancy Number
Haryana
HR88B8888
Car Registration
VIP Number Auction
Vehicle Registration Number
India
RTO

More Telugu News