'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. చిరంజీవి సినిమాలో రోల్ ఆఫర్ చేసిన బాబీ
- 'రాజు వెడ్స్ రాంబాయి' సక్సెస్ మీట్‌లో ఆసక్తికర ఘటన
- ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు బాబీ
- సినిమా చూసి ఫిదా అయిన బాబీ.. దర్శకుడికి బంపరాఫర్
- చిరంజీవి సినిమాలో దర్శకుడు సాయిలుకు రోల్ ఆఫర్
'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రాన్ని చూసి తాను ఎంతో ముగ్ధుడనయ్యానని బాబీ తెలిపారు. సాయిలు ప్రతిభకు ఫిదా అయిన ఆయన.. తాను మెగాస్టార్ చిరంజీవితో తీయబోయే తదుపరి సినిమాలో సాయిలుకు ఒక పాత్రను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఊహించని ఈ ప్రతిపాదనతో సాయిలు కంపాటి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించారు.
సక్సెస్‌మీట్ వేదికపై జరిగిన ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక యువ దర్శకుడి ప్రతిభను గుర్తించి, పెద్ద సినిమాలో అవకాశం ఇవ్వడంపై బాబీని పలువురు ప్రశంసిస్తున్నారు.