Sampath Nandi: సినీ దర్శకుడు సంపత్ నంది ఇంట విషాదం

Sampath Nandis Father Nandi Kishtaiah Passes Away
  • టాలీవుడ్ దర్శకుడు సంపత్ నందికి పితృవియోగం
  • అనారోగ్యంతో తండ్రి కిష్టయ్య కన్నుమూత
  • ప్రస్తుతం శర్వానంద్‌తో 'భోగి' సినిమా చేస్తున్న సంపత్
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య (73) మంగళవారం రాత్రి అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం సంపత్ నంది హీరో శర్వానంద్‌తో 'భోగి' అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. 

షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఈ విషాదం జరగడంతో ఆయన కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది. ఈ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సంపత్ నందికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఫార్మసీ చదివినప్పటికీ సినిమాలపై ఉన్న ఆసక్తితో సంపత్ నంది హైదరాబాద్ వచ్చి, రచయిత పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా చేరారు. అనంతరం కొన్ని యాడ్ ఫిలిమ్స్‌కి దర్శకత్వం వహించి, పూర్తిస్థాయి దర్శకుడిగా మారి పలు విజయవంతమైన చిత్రాలు అందించారు. ఇటీవలే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తమన్నా హీరోయిన్‌గా నటించిన 'ఓదెల 2' విడుదలైంది. 

   
Sampath Nandi
Nandi Kishtaiah
Director Sampath Nandi
Telugu Cinema
Bogi Movie
Sharwanand
Posani Krishna Murali
Oohalu Gusagusalade
Odela 2
Telugu Film Industry

More Telugu News