Vangalapudi Anitha: ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు

Vangalapudi Anitha Focuses on Strengthening AP Police with New Vehicles
  • రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
  • శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతన్న మంత్రి అనిత 
  • నేర నియంత్రణకు టెక్నాలజీ, వసతుల కల్పనలో రాజీ పడబోమని వెల్లడి
  • త్వరలో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందిస్తామని హామీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖకు అవసరమైన సాంకేతికత, వసతుల కల్పన విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని ఆమె తేల్చిచెప్పారు. అమరావతిలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్పెషల్ సెక్రెటరీతో మంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
 
ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల ప్రస్తుత పరిస్థితి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీ వినియోగం, పోలీసు విభాగానికి చెందిన మానవ వనరులు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు త్వరలోనే కొత్త వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని, శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె పునరుద్ఘాటించారు.
Vangalapudi Anitha
AP Home Minister
Andhra Pradesh Police
Police Stations AP
Crime Control AP
Law and Order AP
AP Police Vehicles
Amaravati
AP Government

More Telugu News