ఢిల్లీలో వాయు కాలుష్యం.. రంగంలోకి దిగిన ప్రధానమంత్రి కార్యాలయం
- ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
- కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
- విద్యుత్ వాహనాలను విస్తృతపరిచే చర్యలు ముమ్మరం చేయాలని సూచన
ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఢిల్లీలోని వాయు నాణ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వాహనాల కాలుష్యం ప్రధానాంశంగా ప్రస్తావనకు వచ్చింది. దేశ రాజధానిలో ఇంకా 37 శాతం మేర పాత వాహనాలు వినియోగంలో ఉన్నట్లు సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
వాటి స్థానంలో ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈవీ వాహనాలకు రాయితీలు ఇవ్వడంతో పాటు ఛార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. కాలుష్య కారక పెట్రోల్, డీజిల్ వాహనాలు వినియోగాన్ని తగ్గించాలని అన్నారు.