Avihitham: కంటెంట్ అంటే ఇది అనిపిస్తున్న ఓటీటీ సినిమా!

Avihitham Movie Update
  • ఓటీటీకి వచ్చిన 'అవిహితం' 
  • విలేజ్ నేపథ్యంలో సాగే కథ 
  • ఆకట్టుకునే సహజత్వం 
  • ఆలోచింపజేసే కథా బలం

కథ ముఖ్యమా? కాంబినేషన్ ముఖ్యమా? అనేది చాలాచోట్ల వినిపించే చర్చ. కథ బాగోలేకపోతే కాంబినేషన్ చేసేదేముంది అనేది కొందరైతే, క్రేజీ కాంబినేషన్ లేకపోతే ఆ కథ ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది? అనేది మరికొందరు. కథ బాగుందో లేదో తెలియాలంటే ఆడియన్స్ థియేటర్ కి రావాలి గదా. అలా వాళ్లను రప్పించేది కాంబినేషనే అనేది ఇంకొందరి వాదన. ఇలా జరిగే వాదనలు జరుగుతూనే ఉంటాయి. ఈలోగా థియేటర్స్ కి సినిమాలు వచ్చిపోతూనే ఉంటాయి. 

ఒకప్పుడు ఏడాదిపాటు కథపై కసరత్తు చేసి, మూడు నెలల్లో సినిమా తీసేవారు. కానీ ఇప్పుడు కాంబినేషన్ సెట్ కాగానే కథ అనుకోవడానికి కొన్ని వారాలే పడుతోంది. షూటింగుకి మాత్రం ఏళ్లకి ఏళ్లు పడుతుంది. తీరా థియేటర్ కి వచ్చిన తరువాత, అది మూడు రోజులకి మించి నిలబడలేకపోతోంది. ప్రేక్షకుల వెంట వెళ్లలేకపోతోంది .. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోతోంది. అందుకు కారణం కథలో విషయం లేకపోవడం .. కథ అనేది కచ్చితంగా ఆకాశంలో నుంచి ఊడిపడాలని అనుకోవడమే. 

కానీ కొన్ని సినిమాలు మాత్రం కథనే ముఖ్యం అనే విషయాన్ని అప్పుడప్పుడు గుర్తుచేస్తూ ఉంటాయి. స్టార్స్ తో .. భారీ ఖర్చుతో పనిలేకుండా ఈ సినిమాలు అలరిస్తాయి .. ఆకట్టుకుంటాయి. అలాంటి జాబితాలో 'అవిహితం' అనే ఒక చిన్న సినిమా కనిపిస్తుంది. రీసెంటుగా ఈ మలయాళ సినిమా 'జియో హాట్ స్టార్' లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఎదుటివాళ్లు అల్లరిపాలవుతూ ఉంటే చూసి మానసిక ఆనందాన్ని పొందే కొన్ని పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. తమ కాలక్షేపం కోసం ఇతరుల పరువు ప్రతిష్ఠలతో ఆడుకునే కొన్ని స్వభావాల కథ ఇది. అలాంటి ఈ కథ ఇప్పుడు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కథ అనేది ఆకాశంలో నుంచి కాదు, జనంలో నుంచి పుట్టాలి అనే విషయాన్ని నిరూపించే ఈ కంటెంట్, ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.     


Avihitham
OTT movie
Malayalam movie
Jio Hotstar
Telugu dubbed movie
Content driven cinema
Movie review
Story importance
Avihitham movie review
Mental health

More Telugu News