Jaggareddy: ఇతర పార్టీల్లో గెలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోం: జగ్గారెడ్డి

Jaggareddy Says No to Inducting Winners From Other Parties
  • పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామన్న జగ్గారెడ్డి
  • వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టీకరణ
  • రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పినా విననని వ్యాఖ్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చేర్చుకోబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని అన్నారు.

భార్య నిర్మలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపుతానని తెలిపారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడినా తన నిర్ణయం మారదని స్పష్టం చేశారు. తాను ఎన్నికల బరిలో ఉండనని తేల్చిచెప్పారు.

కాగా, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు, నోటిఫికేషన్ ఈ సాయంత్రం విడుదల కానుంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. మూడు విడల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
Jaggareddy
Telangana Congress
Local Body Elections
Panchayat Elections
Revanth Reddy

More Telugu News