Dharmendra: హేమమాలినితో పెళ్లి కోసం మతం మారిన ధర్మేంద్ర.. హేమ కౌగిలి కోసం డబ్బు ఖర్చు పెట్టిన వైనం!

Dharmendra Converted Religion to Marry Hema Malini
  • హేమమాలిని కోసం ఇస్లాం మతం స్వీకరించిన ధర్మేంద్ర
  • మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌కు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి
  • 'షోలే' షూటింగ్‌లో హేమ కోసం లైట్‌బాయ్స్‌కు డబ్బులిచ్చారన్న ప్రచారం
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో, ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా నటి హేమమాలినితో జరిగిన రెండో పెళ్లి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన ఆయన ప్రేమకథ, అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.

19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకున్న ధర్మేంద్రకు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, 1970లలో హేమమాలినితో వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. ముఖ్యంగా 'షోలే' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఓ సన్నివేశంలో హేమను కౌగిలించుకునే అవకాశం కోసం ధర్మేంద్ర లైట్‌బాయ్స్‌కు రూ.2000 టిప్స్ ఇచ్చి టేకులు పెంచేవారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

అయితే, వీరి పెళ్లికి ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ అంగీకరించలేదు. విడాకులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, ధర్మేంద్ర ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి సాధ్యం కాకపోవడంతో, ఆయన ఇస్లాం మతం స్వీకరించి, దిలావర్ ఖాన్‌గా పేరు మార్చుకుని 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నారని అప్పటి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే, హేమమాలిని అభీష్టం మేర ఆ తర్వాత సంప్రదాయ అయ్యంగార్ (హేమ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కులానికి చెందిన వారు) పద్ధతిలో కూడా వివాహ తంతు జరిగిందని అంటారు.    

ఈ పెళ్లి ఆయన మొదటి కుటుంబంలో తీవ్ర అలజడికి కారణమైంది. ముఖ్యంగా కుమారులు సన్నీ, బాబీలతో ఆయన సంబంధాలపై ప్రభావం చూపింది. అయితే, మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ఎప్పుడూ ధర్మేంద్రను తప్పుబట్టలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో ఆమె, "ఆయన మంచి తండ్రే, కానీ ఒక భార్యగా నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేరు" అని చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
Dharmendra
Hema Malini
Bollywood
Prakash Kaur
Sunny Deol
Bobby Deol
marriage controversy
Sholay movie
love affair
conversion to Islam

More Telugu News