Wife: భార్య ఫోన్ చెక్ చేస్తే బయటపడిన నిజం.. షాక్ అయిన భర్త!

Woman hide her marriage and got second marriage
  • మ్యారేజ్ బ్యూరో ద్వారా యువకుడికి వివాహం
  • ఇప్పటికే పెళ్లై కూతురుందన్న విషయాన్ని దాచిన యువతి
  • రెండు రోజులకే అసలు విషయం తెలిసి నిలదీసిన భర్త
  • నగదు, బంగారం సహా పరారైన నవవధువు
  • యువతితో పాటు ఆమె తల్లి, బ్యూరో నిర్వాహకులపై కేసు
వరంగల్ జిల్లాలో ఓ యువకుడు ఘోరంగా మోసపోయాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పరిచయమైన ఓ యువతి, తనకు ఇదివరకే పెళ్లై ఓ కుమార్తె కూడా ఉన్న విషయాన్ని దాచిపెట్టి అతడిని వివాహం చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే అసలు విషయం బయటపడటంతో ఇంట్లోని బంగారం, నగదుతో పరారైంది. పర్వతగిరి మండలం చౌటపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితుడి కథనం ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి దేవేందర్రావు (31) పెళ్లి కోసం వరంగల్‌లోని ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. నిర్వాహకులు అతడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిర (30) ప్రొఫైల్ చూపించగా, ఆమె నచ్చడంతో పెళ్లికి సిద్ధమయ్యాడు. గత నెల 24న వరంగల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసి ఘనంగా వివాహం జరిపించాడు. ఈ సందర్భంగా వధువుకు 8.5 తులాల బంగారు ఆభరణాలు పెట్టాడు.

పెళ్లైన రెండు రోజులకే ఇందిర ప్రవర్తనపై అనుమానం రావడంతో దేవేందర్ ఆమె ఫోన్‌ను పరిశీలించాడు. ఆమెకు అప్పటికే వివాహమై, ఓ కుమార్తె కూడా ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. దీనిపై ఆమెను నిలదీయగా, విడాకులు తీసుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ మరుసటి రోజే ఇందిర ఇంట్లోని నగదు, బంగారం సహా కనిపించకుండా పోయింది.

పరువు పోతుందనే భయంతో మొదట మౌనంగా ఉన్న దేవేందర్ చివరకు సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. ఇందిర, ఆమె తల్లి లక్ష్మి, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపై ఫిర్యాదు చేశాడు. నిందితురాలు గతంలోనూ ఇలాగే కొందరిని మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని, దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
Wife
Husband
Matimony
Warangal Rural District
Fraud
Marriage Fraud

More Telugu News