Malavath Mohan: వేధిస్తున్న భర్తను చంపేసిన ఇద్దరు భార్యలు!
- భర్త వేధింపులతో విసిగిపోయిన ఇద్దరు భార్యలు
- నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
- నిజామాబాద్ జిల్లా దేవక్కపేటలో ఘటన
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భీమ్‌గల్ మండలం దేవక్కపేటలో ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ అమానవీయ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. దేవక్కపేటకు చెందిన మలవత్ మోహన్ (42)కు కవిత, సంగీత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. మోహన్ తరచూ మద్యం సేవించి వచ్చి భార్యలతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా గొడవపడి, వారిద్దరినీ ఒక గదిలో బంధించాడు.
భర్త వేధింపులు భరించలేకపోయిన భార్యలు, అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం సోమవారం ఉదయం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మోహన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న అతను అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు.
ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.