Hakimpur: కేంద్రం 'ఎస్ఐఆర్' ప్రభావం.. హకీంపూర్ మీదుగా తమ దేశానికి వెళుతున్న బంగ్లాదేశీయులు

Hakimpur Sees Bangladeshis Return Home Due to SIR Impact
  • ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇళ్లకు వెళ్లి పత్రాలను తనిఖీ చేస్తున్న ఎన్యుమరేటర్లు
  • హకీంపూర్ పోస్టు ద్వారా వెళ్లిపోతున్న బంగ్లాదేశ్ వాసులు
  • పనుల కోసం చట్టవిరుద్ధగా భారత్‌లోకి ప్రవేశించినట్లు అంగీకారం
పశ్చిమ బెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన హకీంపూర్ నుంచి అనేక మంది స్వదేశమైన బంగ్లాదేశ్‌కు తిరిగి వెళుతున్నారు. బెంగాల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కారణంగా వారు స్వస్థలాలకు తరలివెళుతున్నట్లు తెలుస్తోంది.

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా, ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేని బంగ్లాదేశ్ జాతీయులు, గత కొన్నేళ్లుగా హకీంపూర్‌లో స్థిరపడిన వారు, ఈ నెల ప్రారంభం నుంచి స్వచ్ఛందంగా తమ దేశానికి తిరిగి వెళుతున్నారు.

నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఓటరు కార్డులు కలిగి ఉన్నవారు, అలాగే ఎటువంటి పత్రాలు లేని వారు హకీంపూర్ సరిహద్దు అవుట్ పోస్టు ద్వారా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల సిబ్బంది నుంచి తప్పించుకోలేమనే ఉద్దేశంతో వారు తిరిగి వెళుతున్నట్లు తెలుస్తోంది. 1947 దేశ విభజన మరియు 1971 బంగ్లాదేశ్ విమోచన సమయంలో వేలాది మంది బంగ్లాదేశ్ నుండి ఇక్కడకు వలస వచ్చారు. వీరిలో ఎక్కువ మంది దినసరి కూలీలు ఉన్నారు.

పనుల కోసం చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు వారు కూడా అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నెల ప్రారంభం నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడం ప్రారంభమైనప్పటికీ, రెండవ వారం నుంచి వెళ్లే వారి సంఖ్య పెరిగినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అయితే, ఎంతమంది తిరిగి వెళ్లారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Hakimpur
West Bengal
Bangladesh Border
SIR
Voter List
Bangladeshi Immigrants

More Telugu News