Smriti Mandhana: స్మృతి మంధన ఇన్‌స్టా ఖాతాలో ఆ ఫొటోలు మాయం!

Smriti Mandhana Deletes Engagement Posts After Wedding Postponed
  • పెళ్లి వేడుకలు జరుగుతుండగా అనారోగ్యానికి గురైన స్మృతి మంధన తండ్రి 
  • తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో వివాహ సంబరాల నిలిపివేత
  • ఇన్‌స్టా ఖాతా నుంచి కనిపించకుండా పోయిన సంబరాల ఫొటోలు
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించింది. ఆమె వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం విదితమే. వివాహ వేడుకలు జరుగుతుండగా స్మృతి మంధన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో వివాహ సంబరాలను నిలిపివేశారు. ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి వివాహ సంబరాల ఫొటోలు కూడా మాయమయ్యాయి.

పలాశ్ ముచ్చల్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధృవీకరిస్తూ ఇటీవల స్మృతి మంధన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. సహచర క్రికెటర్లతో కలిసి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన వేలికి నిశ్చితార్థపు ఉంగరం ఉందంటూ చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కనిపించడం లేదు. ఇదే వీడియోను స్మృతి స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక కూడా తమ సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి తొలగించారు.

ఈ వీడియోను స్మృతి మంధన తొలగించిందా? లేక హైడ్ చేసిందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పలాశ్ ముచ్చల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రపోజల్ వీడియో మాత్రం అలాగే ఉంది. వన్డే క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన స్టేడియంలోనే స్మృతి వేలికి ఉంగరం తొడుగుతూ పలాశ్ వివాహ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో మాత్రం అలాగే ఉంది. 

తండ్రి అనారోగ్యానికి గురైన ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే పెళ్లిని వాయిదా వేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మేనేజర్ ప్రకటించారు. అటు పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
Smriti Mandhana
Indian woman cricketer
Palash Muchhal
engagement photos deleted

More Telugu News