Sravanthi: నెల్లూరు మేయర్‌ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం

Sravanthi Faces No Confidence Motion as Nellore Mayor
  • జేసీకి నోటీసు అందజేసిన 40 మంది కార్పొరేటర్లు
  • మేయర్ దంపతులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని విమర్శలు
నెల్లూరు నగర పాలక సంస్థలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మేయర్‌ స్రవంతిపై సొంత పార్టీ కార్పొరేటర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు 40 మంది కార్పొరేటర్లు ఈరోజు జాయింట్ కలెక్టర్ (జేసీ) వెంకటేశ్వర్లును కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు.

మేయర్‌ స్రవంతి, ఆమె భర్త నగర అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వారి అవినీతి, జోక్యం కారణంగా ఫైళ్లు ముందుకు కదలడం లేదని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆదివారం మంత్రి నారాయణకు కూడా వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లనూ వైసీపీ కైవసం చేసుకుంది. అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో మేయర్ స్రవంతి తటస్థంగా వ్యవహరిస్తున్నారని, నగరాభివృద్ధిపై దృష్టి సారించడం లేదని కార్పొరేటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలే తాజా అవిశ్వాసానికి దారితీసినట్లు తెలుస్తోంది. మంత్రికి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇంతమంది కార్పొరేటర్లు ఏకమై అవిశ్వాసానికి సిద్ధపడటం నగరంలో చర్చనీయాంశమైంది. 
Sravanthi
Nellore Mayor
Nellore Municipal Corporation
No Confidence Motion
YSRCP
Nellore Politics
Andhra Pradesh Politics
Minister Narayana
Corruption Allegations
Municipal Administration

More Telugu News