Shivaji: ఐబొమ్మ రవి వ్యవహారంపై స్పందించిన శివాజీ.. ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు

Shivaji responds to Ibomma Ravi makes key comments on industry
  • ఇండస్ట్రీలో 95 శాతం మందిది సాధారణ జీవితమే అని వెల్లడి
  • ఐబొమ్మ రవి విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని వ్యాఖ్య
  • కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారన్న శివాజీ
పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు రవి అంశంపై నటుడు శివాజీ స్పందించారు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా శిక్ష తప్పదని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అలాగే, థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్‌లు ఆరోగ్యానికి మంచివి కావని, వాటిని తినకపోవడమే ఉత్తమమని ప్రేక్షకులకు ఓ ఆసక్తికర సూచన చేశారు.

ఇక, సినీ పరిశ్రమలో అందరూ విలాసవంతమైన జీవితం గడుపుతారనేది ఒక అపోహ మాత్రమేనని, 95 శాతం మంది సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారని శివాజీ అన్నారు. కేవలం 5 శాతం మంది విలాసవంతంగా జీవించే వారిని చూసి మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సినిమా టికెట్ల ధరల పెంపుపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

"పండగ సమయాల్లో బస్సు టికెట్ల ధరలు మూడు రెట్లు పెంచుతారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. కానీ, సినిమా టికెట్ ధర రూ.100 పెరిగితే మాత్రం ఇండస్ట్రీని విలన్‌గా చిత్రీకరిస్తారు" అని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు.


Shivaji
Telugu cinema
Tollywood
Ibomma Ravi
Movie tickets price
Piracy website
Popcorn
Movie industry
Telugu film industry
Ravi Amsam

More Telugu News