Whatsapp: వాట్సాప్ హ్యాక్ అయిందని సందేహమా.. ఇలా చేయండి

Whatsapp Hack Alert How to Check and Secure Your Account
  • ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఫోన్లను హ్యాక్ చేస్తున్న సైబర్ దుండగులు
  • ఆపై బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని నిపుణుల హెచ్చరిక
  • సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను తెరవొద్దని సూచన
సోషల్ మీడియాలో ఏపీకే ఫైల్ లింకులను పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీకే ఫైల్ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని సూచిస్తున్నారు. ఆ లింక్ ను తెరిస్తే మీ ఫోన్ హ్యాకర్ల నియంత్రణలోకి పోతుందని, మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మంతా దోచేస్తారని తెలిపారు. గత వారం రోజులుగా తెలంగాణలో మొబైల్ హ్యాకింగ్ ఘటనలు పెరిగిపోయాయని చెప్పారు. వాట్సాప్ లో ఏపీకే ఫైల్ రూపంలో మాల్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంపి హ్యాక్ చేస్తున్నారని హెచ్చరించారు. హ్యాక్ చేసిన మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఫోన్ ఓవర్ హీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే మొబైల్ హ్యాక్ అయినట్లు భావించాలని చెప్పారు.
 
వాట్సాప్ హ్యాక్ అయిందనిపిస్తే..
వాట్సాప్‌‌‌‌ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాలి. ఆపై గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ ను మళ్లీ ఇన్ స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసుకోవాలి. టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం ద్వారా హ్యాకర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. సెట్టింగ్స్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్షన్ ను డిజేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రం అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. అవసరమైన యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్, మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌ అయినట్లు‌ అనుమానం వస్తే మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌ పిన్ నంబర్లు, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చుకోవాలి.
Whatsapp
Whatsapp hack
APK file
malware
cyber crime
mobile security
data breach
phone hacking
two step verification
google play store

More Telugu News