Swayambhu: నిఖిల్ 'స్వయంభు' రిలీజ్ డేట్ వచ్చేసింది.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

Nikhil Swayambhu Release Date Announced with Goosebumps Video
  • 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
  • 8 భాషల్లో రానున్న పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామా
  • అంచనాలు పెంచేసిన 'రైజ్ ఆఫ్ స్వయంభు' వీడియో
హీరో నిఖిల్ సిద్ధార్థ అభిమానుల నిరీక్షణకు చిత్ర బృందం తెరదించింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

విడుదల తేదీ ప్రకటన సందర్భంగా 'రైజ్ ఆఫ్ స్వయంభు' పేరుతో ఓ ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు, భారీ సెట్టింగులు, నిఖిల్ వారియర్ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మొత్తం మీద ఈ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇక‌, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని చిత్ర బృందం వెల్లడించింది. త్వరలోనే ప్రమోషన్లు పెద్ద ఎత్తున ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నిఖిల్, ఈ చిత్రంతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కలిపి మొత్తం 8 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. 'బాహుబలి' ఫేమ్ కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Swayambhu
Nikhil Siddhartha
Swayambhu Release Date
Nikhil Swayambhu
Samyuktha
Nabha Natesh
Bharath Krishnamachari
Pan World Movie
Telugu Movie
Indian Cinema

More Telugu News