Namansh Syal: పైలట్ నమాన్ష్ కు రష్యా ఎయిర్ ఫోర్స్ నివాళి.. ఆకాశంలో మిస్సింగ్ మ్యాన్ విన్యాసం

Russian Air Force Honors Pilot Namansh Syal with Missing Man Formation
  • దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ కూలిపోవడంతో నమాన్ష్ దుర్మరణం
  • హిమాచల్ ప్రదేశ్ లోని స్వగ్రామంలో నమాన్ష్ అంత్యక్రియలు పూర్తి
  • కన్నీళ్లతో సెల్యూట్ చేస్తూ భర్తను సాగనంపిన వింగ్ కమాండర్ అప్షాన్
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలడం, పైలట్ నమాన్ష్ శ్యాల్ మరణించిన విషయం విదితమే. ఆయన మృతికి నివాళిగా రష్యా వైమానిక దళం ఆకాశంలో ఫైటర్ జెట్లతో ‘మిస్సింగ్ మ్యాన్’ విన్యాసం చేసింది. వింగ్ కమాండర్ నమాన్ష్ కు గౌరవ సూచకంగా ఈ ప్రదర్శన చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తేజస్ పైలట్ నమాన్ష్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామంలో పూర్తయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని పతియాల్కర్ గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కన్నీటి వీడ్కోలుతో వైమానిక దళం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. నమాన్ష్ శ్యాల్ భార్య, వింగ్ కమాండర్ అఫ్షాన్ తన భర్తకు కన్నీటితో చివరి సెల్యూట్ చేసి వీడ్కోలు పలికారు.

మిస్సింగ్ మ్యాన్ విన్యాసం అంటే..
పైలట్లు, సైనిక సిబ్బంది లేదా ప్రముఖ రాజకీయ నాయకుల మరణానికి సంతాపంగా, గౌరవ వందనం సమర్పించేందుకు నిర్వహించే వైమానిక ప్రదర్శనే ‘మిస్సింగ్ మ్యాన్ విన్యాసం’. ఆ వ్యక్తి లేని లోటును, వారి చివరి ప్రయాణానికి సూచనగా ఈ విన్యాసం నిర్వహిస్తారు. ఈ విన్యాసంలో నాలుగు విమానాలు "వి" ఆకారంలో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. ఒక నిర్దిష్ట సమయంలో 3వ స్థానంలో ఉన్న విమానం, అకస్మాత్తుగా పైకి లేచి ఆకాశంలోకి దూసుకెళ్తుంది. మిగిలిన మూడు విమానాలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి, కానీ వాటి మధ్య ఖాళీ స్థలం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఖాళీ స్థలం మరణించిన వ్యక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది.
Namansh Syal
Missing Man formation
Russian Air Force
Tejas fighter jet
Dubai Air Show
Wing Commander
Air Force tribute
Air accident
Military honors
Patiyalkar village

More Telugu News