బాధిత కుటుంబాలకు బీమా చెక్కులు అందజేసిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు
- 220 కుటుంబాలకు రూ.11 కోట్ల బీమా చెక్కులను పంపిణీ చేసిన నాగబాబు
- ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం
- పవన్ కల్యాణ్ ఆలోచనతో ఈ బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడి
- ఇప్పటివరకు 1400 బాధిత కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్న నాగబాబు
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పార్టీ జెండాను భుజాలపై మోసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,400 మంది బాధిత కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించామని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.