Dharma Mahesh: పుట్టినరోజున తనయుడికి నటుడు ధర్మ మహేశ్ బంపర్ గిఫ్ట్!

Dharma Mahesh Gifts Restaurant to Son Jagadwaj on Birthday
  • హైదరాబాద్‌లో కొత్తగా 'జిస్మత్ జైల్ మందీ' రెస్టారెంట్ ను ప్రారంభించిన నటుడు ధర్మ మహేశ్
  • ‘గిస్మత్' నుంచి 'జిస్మత్'గా మారిన బ్రాండ్ పేరు
  • సంస్థ యాజమాన్యాన్ని పూర్తిగా కొడుకు జగద్వాజకు అప్పగిస్తున్నానన్న ధర్మ మహేశ్
హైదరాబాద్ నగర మందీ ప్రియులకు సుపరిచితమైన 'గిస్మత్' బ్రాండ్ ఇప్పుడు కొత్త పేరుతో, సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. నటుడు, వ్యవస్థాపకుడు ధర్మ మహేశ్ అమీర్‌పేట సత్యం థియేటర్ సమీపంలో 'జిస్మత్ జైల్ మందీ' పేరుతో వినూత్నమైన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తన ప్రియమైన కుమారుడు జగద్వాజ జన్మదినం సందర్భంగా ఈ నూతన అవుట్‌లెట్‌ను ప్రారంభించడం విశేషం.

ఈ సందర్భంగా ధర్మ మహేశ్ మీడియాతో మాట్లాడుతూ, మందీ అనగానే భోజన ప్రియులకు 'జిస్మత్' మాత్రమే గుర్తుకు రావాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అందుకే చికెన్, మటన్, చేపలతో పాటు పన్నీర్ వంటి శాకాహార వంటకాలను కూడా నాణ్యమైన రుచులతో అందిస్తున్నామని వివరించారు. 'గిస్మత్' నుంచి 'జిస్మత్'గా బ్రాండ్ పేరు మార్చడం కేవలం మార్పు కాదని, ఇది నాణ్యత, భావోద్వేగం, వారసత్వంతో కూడిన ఒక కొత్త ప్రయాణానికి నాంది అని ఆయన పేర్కొన్నారు.

‘సింధూరం’, ‘డ్రింకర్ సాయి’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ధర్మ మహేశ్, ఈ సందర్భంగా ఒక కీలక ప్రకటన చేశారు. తన వ్యాపార సామ్రాజ్యం మొత్తాన్ని తన కుమారుడు జగద్వాజ పేరు మీదకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బ్రాండ్ తన కుమారుడిపై ఉన్న ప్రేమ నుంచి పుట్టిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని భావోద్వేగంగా తెలిపారు. యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకు రెస్టారెంట్ కార్యకలాపాలను, విస్తరణ ప్రణాళికలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు.

కాగా, భార్య గౌతమి చౌదరితో వివాదం నేపథ్యంలో ధర్మ మహేశ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో భార్యతో కలిసి ప్రారంభించిన రెస్టారెంట్ పేరును మార్చేశారు. తన కుమారుడి పేరు జగద్వాజ కలిసి వచ్చేలా జిస్మత్ గా మారుస్తున్నట్లు ధర్మ మహేశ్ వెల్లడించారు. గిస్మత్ బ్రాండ్ తనదని భార్య గౌతమి క్లెయిమ్ చేసుకోవడంతో రెస్టారెంట్ పేరు మార్చినట్లుగా తెలుస్తోంది. 
Dharma Mahesh
Gismat Jail Mandi
Hyderabad Restaurants
Jagadwaj
Sindhooram Movie
Drinker Sai Movie
Gautami Chowdary
Restaurant Business
Telugu Cinema
Mandi Food

More Telugu News