Jabalpur Lady Gang: జబల్‌పూర్‌లో లేడీ గ్యాంగ్ అరాచకం.. రీల్స్ కోసం యువతుల కిడ్నాప్‌లు.. వీడియో ఇదిగో!
- రీల్స్ కోసం యువతులను కిడ్నాప్ చేస్తున్న లేడీ గ్యాంగ్
- బాధితులను కొడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్
- మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన
- వీడియో వైరల్ కావడంతో ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురి అరెస్ట్
- గతంలోనూ పలువురిపై ఈ గ్యాంగ్ దాడి చేసినట్లు పోలీసుల అనుమానం
సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారనడానికి మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఘటనే నిలువెత్తు సాక్ష్యం. రీల్స్ కోసం కొందరు యువతులు ఏకంగా ఓ గ్యాంగ్‌గా ఏర్పడి, తోటి యువతులను కిడ్నాప్ చేసి దారుణంగా కొడుతూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జబల్‌పూర్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఇటీవల ఓ యువతిని ఈ గ్యాంగ్ అపహరించింది. అనంతరం ఆమె జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా కొడుతూ, కాళ్లతో తన్నుతూ వీడియో చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన గ్యాంగ్‌లోని ఇద్దరు 17 ఏళ్ల బాలికలతో పాటు మరో యువతిని అరెస్ట్ చేశారు. కేవలం సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసమే వీరు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గ్యాంగ్ గతంలోనూ ఇదే తరహాలో మరికొందరు యువతులపై దాడులు చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.