Chandrababu Naidu: సత్యసాయికి చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి.. సేవా మార్గాన్ని స్మరించుకున్న నేతలు

Chandrababu Naidu Pays Tribute to Sathya Sai Baba on Centenary
  • భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా నివాళులు
  • సాయి చూపిన సేవా మార్గాన్ని స్మరించుకున్న చంద్రబాబునాయుడు
  • మన మధ్య నడయాడిన దైవం సత్యసాయి అని కొనియాడిన సీఎం
  • ప్రేమ, సమానత్వమే సాయి తత్వమని పేర్కొన్న నారా లోకేశ్
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సాయిబాబా అందించిన సేవలను, బోధనలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
 
"మన ముందు నడయాడిన దైవం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా" అని చంద్రబాబు తన ట్వీట్‌లో అభివర్ణించారు. విద్య, వైద్యం, తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలతో ఆయన కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. "అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు" అంటూ మానవ సేవే మాధవ సేవ అని ఆచరించి నిరూపించిన మహనీయుడని ప్రశంసించారు. పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిన ఘనత సాయిబాబాదేనని చంద్రబాబు పేర్కొన్నారు.
 
నారా లోకేశ్ స్పందిస్తూ.. ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి అనేవి ప్రతి మనిషి జీవిత పరమార్థమని సత్యసాయి బోధించారని తెలిపారు. సత్యసాయి బాబా జన్మించిన ఆంధ్రప్రదేశ్‌లో తాను కూడా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. "ప్రేమతత్వమే మానవత్వం, సమానత్వమే సాయి తత్వం" అని చాటి చెప్పారని పేర్కొన్నారు. భగవాన్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాసేవకు అంకితమైన కోట్లాది మంది భక్తులే సత్యసాయి ప్రతిరూపాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu
Nara Lokesh
Sathya Sai Baba
Sri Sathya Sai Baba
Puttaparthi
Telugu Desam Party
Andhra Pradesh
Centenary Celebrations
Social Service
Spirituality

More Telugu News