ఐ-బొమ్మ రవి మూడో రోజు విచారణ... దేశ, విదేశాల్లోని సంబంధాలపై ఆరా
- రవిని ఐదు రోజుల పోలీసుల కస్టడీకి ఇచ్చిన నాంపల్లి కోర్టు
- నేడు మూడో రోజు ముగిసిన ఐ-బొమ్మ రవి విచారణ
- విదేశాల్లోని లింకులు, ఆస్తులపై ప్రశ్నించిన అధికారులు
ఎవరెవరు సహకరిస్తున్నారు, ఈ వ్యవహారంలో రవి వెనుక ఎంతమంది ఉన్నారనే విషయాలపై ప్రశ్నించారని సమాచారం. సైబర్ నేరాలకు ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను నేరగాళ్లు వేదికగా మలుచుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా విడుదలైన సినిమాలను సేకరించే విధానం, ఐ-బొమ్మ సహా మిర్రర్ సైట్‌లలోకి అప్‌లోడ్ చేసే విధానంపై పోలీసులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.