Jair Bolsonaro: ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పదవిలో కొనసాగేందుకు కుట్ర.. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు అరెస్టు
- తిరుగుబాటుకు కుట్ర అభియోగాలపై సెప్టెంబర్‌లో 27 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
- నిర్బంధంలో ఉన్న ఆయనను ఇంట్లో అరెస్టు చేసిన పోలీసులు
- బ్రెసిలియాలోని పోలీసు కేంద్ర కార్యాలయానికి తరలింపు
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను బ్రెసిలియాలోని ఆయన నివాసంలో ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. 2022 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి, తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న అభియోగాలపై ఆయనకు కోర్టు ఇటీవల 27 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు, రాజధాని బ్రెసిలియాలోని పోలీసు కేంద్ర కార్యాలయానికి తరలించినట్లు బోల్సోనారో ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్న బోల్సోనారో, 2022లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి ఆయన నిరాకరించారు. ఆ సమయంలో వేలాది మంది ఆయన మద్దతుదారులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పదవిలో కొనసాగేందుకు బోల్సోనారో తిరుగుబాటు కుట్రకు ప్రణాళికలు రచించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఆయనకు 27 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సెప్టెంబర్ నెలలో తీర్పు వెలువరించింది.
ఆయన విచారణ సమయం నుంచే గృహనిర్బంధంలో ఉన్నారు. న్యాయస్థానం విధించిన శిక్షపై అప్పీలుకు వెళ్ళగా అక్కడ ప్రతికూల ఫలితం వచ్చింది. జైలుకు వెళితే ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటుందని మాజీ అధ్యక్షుడి తరఫు న్యాయవాదులు వాదించారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, గృహనిర్బంధంలోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు అందుకు నిరాకరించింది.