డాలర్ ధాటికి రూపాయి విలవిల.. ఆల్ టైమ్ కనిష్ఠానికి భారత కరెన్సీ
- 89.66 వద్ద ముగిసిన ఫారెక్స్ ట్రేడింగ్
- మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 98 పైసల నష్టం
- అంతర్జాతీయ, దేశీయ పరిణామాలతో భారీ ఒత్తిడి
- త్వరలోనే 90 మార్క్‌ను దాటవచ్చని నిపుణుల అంచనా
దేశీయంగా దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీనికి తోడు, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఓ భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించడం, టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ పెట్టుబడుల తరలింపు వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. గత నెలలో ఎగుమతులు 11 శాతానికి పైగా తగ్గడం, బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరడం కూడా రూపాయి పతనానికి దోహదపడింది.
ఈ నేపథ్యంలో రూపాయి విలువ త్వరలోనే 90 మార్క్‌ను కూడా దాటవచ్చని యా వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనూజ్ గుప్తా అంచనా వేశారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న ఆశలు సన్నగిల్లడంతో డాలర్ ఇండెక్స్ మరింత బలపడి 102-103 స్థాయికి చేరవచ్చని, ఇది రూపాయిని మరింత బలహీనపరుస్తుందని ఆయన విశ్లేషించారు.