Rajesh Singh: యూపీలో అరుదైన వివాహం.. వదినను పెళ్లి చేసుకున్న యువకుడు

UP Man Rajesh Singh Marries Widow Sister in Law
  • ప్రమాదంలో అన్న మరణించడంతో వితంతువుగా మారిన వదిన
  • ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మరిది
  • కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్న యువకుడు
ప్రమాదంలో భర్తను కోల్పోయి వితంతువుగా మారిన వదినను మరిది పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సమాజం ఏమనుకుంటుందోనని ఆలోచించకుండా, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె మెడలో తాళికట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... రాజేశ్ సింగ్ అనే యువకుడి అన్నకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అన్న, వదిన ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న సమయంలో ఓ ప్రమాదం వారి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ దుర్ఘటనలో రాజేశ్ అన్న కన్నుమూయడంతో, ఆయన భార్య చిన్న వయసులోనే వైధవ్యం పాలైంది. దాంతో వదినను పెళ్లాడాలని రాజేశ్ నిర్ణయించుకున్నాడు.

ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చర్చించగా, వారు కూడా అంగీకరించారు. అనంతరం వదినను ఒప్పించి, అందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాజేశ్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు.

యూపీ, రాజస్థాన్, హర్యానా, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంప్రదాయం ఉందని, అమ్మాయి ఇష్టపడితే ఇందులో తప్పులేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, సమాజం వారిని ఎలా స్వీకరిస్తుందోనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Rajesh Singh
Uttar Pradesh
UP news
brother's widow
widow remarriage
Badaun district
social tradition
family support
compassion
humanity

More Telugu News