Smriti Mandhana: ప్రపంచ కప్ గెలిచిన చోటే.. స్మృతి మంధనకు కాబోయే భర్త సర్‌ప్రైజ్!

Smriti Mandhana Gets Surprise Proposal at World Cup Venue
  • ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రపంచ కప్ గెలిచిన మహిళా జట్టు
  • స్మృతి కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యకు తీసుకు వచ్చి ప్రపోజ్ చేసిన పలాశ్
  • ఉంగరాలు మార్చుకున్న స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధనకు ఆమె కాబోయే భర్త ఒక మరుపురాని అనుభూతిని ఇచ్చాడు. ఈ నెల ప్రారంభంలో భారత మహిళా క్రికెట్ జట్టు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ప్రపంచ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే స్టేడియంలో స్మృతి మంధనకు ఆమె కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ మోకాళ్ళపై నిలుచుని తన ప్రేమను వ్యక్తపరిచాడు.

కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకువచ్చి పలాశ్ తన ప్రేమను వ్యక్తం చేయడంతో ఆమె ఆశ్చర్యానికి గురయింది. పలాశ్ ఆమెకు ఒక ఉంగరాన్ని బహూకరించాడు. అనంతరం స్మృతి మంధన అతడిని కౌగిలించుకుంది. ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను పలాశ్ ముచ్చల్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Smriti Mandhana
Smriti Mandhana engagement
Palash Muchhal
Indian women's cricket

More Telugu News