Kentucky Plane Crash: విమానం నుంచి ఊడిపడ్డ ఇంజిన్.. కెంటకీ ప్రమాదానికి కారణమిదే!

Kentucky Plane Crash Engine Failure Blamed for 14 Deaths
  • కెంటకీ విమాన ప్రమాదంపై వెలుగులోకి వచ్చిన నిజాలు
  • టేకాఫ్ అవుతుండగా విమానం నుంచి విడిపోయిన ఇంజిన్
  • దర్యాప్తులో తేల్చిన అధికారులు.. సీసీటీవీ దృశ్యాల విడుదల
  • నవంబర్ 5న జరిగిన ఈ దుర్ఘటనలో 14 మంది మృతి
అమెరికాలోని కెంటకీలో 14 మందిని బలిగొన్న కార్గో విమాన ప్రమాదంపై మిస్టరీ వీడింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ విడిపోవడం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. మంటలతో కూడిన ఇంజిన్ విమానం నుంచి ఊడి పడుతున్న దృశ్యాలను అధికారులు విడుదల చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నవంబర్ 5న లూయిస్‌విల్లే మహ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం భూమికి కేవలం 30 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, దాని ఎడమ రెక్క భాగంలోని ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి, కాసేపటికే అది విమానం నుంచి విడిపోయి కిందపడిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు.

ఈ విమానం కెంటకీ నుంచి హొనోలులుకు బయల్దేరింది. ప్రమాదంలో విమానంలోని ముగ్గురు సిబ్బందితో పాటు, విమానాశ్రయంలోని గ్రౌండ్‌లో ఉన్న మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కార్గో విమానంలో దాదాపు 2.8 లక్షల గ్యాలన్ల ఇంధనం ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు.
Kentucky Plane Crash
Cargo Plane Crash
Louisville Muhammad Ali International Airport
Plane Engine Failure
Kentucky
Honolulu
Aviation Accident
NTSB Investigation
Plane Crash Investigation
Cargo Plane Fire

More Telugu News