Miss Universe 2025: మెక్సికో సుందరికి మిస్ యూనివర్స్ కిరీటం.. విజేతగా నిలిచిన ఫాతిమా బోష్

Miss Universe 2025 Fatima Bosch of Mexico Crowned Winner
  • థాయ్‌లాండ్‌లో ఘనంగా జరిగిన 74వ విశ్వసుందరి పోటీలు
  • గతేడాది విజేత విక్టోరియా చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్న ఫాతిమా బోష్
  • రిహార్సల్స్ సమయంలో వాకౌట్‌తో వార్తల్లో నిలిచిన వైనం
మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లో అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. గతేడాది విశ్వసుందరి, డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జార్ థెల్విగ్.. ఫాతిమాకు కిరీటాన్ని అలంకరించారు. పోటీల ఆరంభం నుంచే ఫేవరెట్‌గా ఉన్న ఫాతిమా తన అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలను మెప్పించారు.

25 ఏళ్ల ఫాతిమా బోష్‌కు స్వదేశంలో, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆమె మిస్ యూనివర్స్ మెక్సికో 2025గా ఎంపికై, విశ్వవేదికపై తన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈ పోటీలకు ముందు జరిగిన ఒక సంఘటన ఆమెను వార్తల్లో నిలిపింది.

రిహార్సల్స్ సమయంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓ పేజెంట్ డైరెక్టర్ తనపై కేకలు వేశారనే ఆరోపణలతో ఫాతిమా ఈవెనింగ్ గౌన్, హీల్స్‌తోనే వేదిక నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటన ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అయినప్పటికీ ఆమె వెంటనే సంయమనం పాటించి తిరిగి రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. తన వృత్తి నిబద్ధతను చాటుకుని, చివరికి విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుని అందరి మన్ననలు పొందారు.
Miss Universe 2025
Fatima Bosch
Mexico
Victoria Kajer Thelvig
Thailand
Pageant Director
Miss Universe Mexico
Beauty Pageant

More Telugu News